తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలిక మృతదేహాన్ని దేవుడికి అర్పించిన గ్రామస్థులు - బాలిక

పశ్చిమ అసోం ధుబ్రి జిల్లాలో విస్తుపోయే సంఘటన జరిగింది. పాముకాటుతో మరణించిన ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని దేవుడికి అర్పించారు గ్రామస్థులు.

ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని దేవుడికి అర్పించిన గ్రామస్థులు

By

Published : Jun 12, 2019, 6:02 AM IST

Updated : Jun 12, 2019, 7:29 AM IST

ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని దేవుడికి అర్పించిన గ్రామస్థులు

దేవుడికి మృతదేహాన్ని అర్పిస్తే తిరిగి జీవం పోసుకుంటారనే విశ్వాసంతో ఐదేళ్ల బాలిక భౌతికకాయాన్ని బ్రహ్మపుత్ర నదిలో పడవలో వదిలేశారు గ్రామస్థులు. వినడానికే వింతగా ఉన్న సంఘటన పశ్చిమ అస్సాంలోని ధుబ్రి జిల్లా బిలాసిపప్రా గ్రామంలో జరిగింది. ఇలా చేస్తే దేవుడు చనిపోయిన వారికి పునరుజ్జీవం ప్రసాదిస్తాడని శివపురాణాల్లోని ఓ కథలో ఉన్నట్లు ఇక్కడి గ్రామస్థులు విశ్వసిస్తారు.

ఐదేళ్ల చిన్నారి పూజా నాథ్​ను గత శుక్రవారం విషసర్పం కాటేసింది. బాలికను ఆసుపత్రికి తరలించకుండా స్థానిక మాంత్రికులతో చికిత్స అందించారు కుటుంబసభ్యులు. పరిస్థితి విషమించాక ఆదివారం రోజు బొంగైగావ్​లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

బాలిక మృతిని తట్టుకోలేని కుటుంబ సభ్యులు చివరకు దేవుడిపై భారం మోపి మృతదేహాన్ని నదిలో వదిలేశారు. గ్రామస్థులు చూస్తుండగానే భౌతికకాయం నదిలో కొట్టుకుపోయింది.

Last Updated : Jun 12, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details