తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏనుగులను ఢీకొట్టిన రైలు ఇంజిన్​ సీజ్​ - Wildlife (Protection) Act

అసోం అటవీశాఖ అధికారులు ఓ రైలు ఇంజిన్​ను సీజ్​ చేశారు. మూడు నెలల క్రితం రెండు ఏనుగులను ఆ ఇంజిన్ ఢీకొట్టగా అవి అక్కడిక్కడే చనిపోయాయి. ఈ కారణంగా అటవీ చట్టాలను అనుసరించి కేసు నమోదు పెట్టి, సీజ్​ చేశారు.

Assam Forest department seizes loco engine for killing elephant on tracks
రైలు ఇంజన్​ని సీజ్​ చేసిన అటవీశాఖాధికారులు

By

Published : Oct 21, 2020, 6:51 PM IST

తల్లి, పిల్ల ఏనుగులు మరణించేందుకు కారణమైన రైలు ఇంజిన్​ను అసోం అటవీ శాఖ అధికారులు సీజ్​ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం కేసు నమోదు చేసి, ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

పఠార్ఖులా, లంసాఖంగ్ రైల్వే స్టేషన్ల మధ్య సెప్టెంబర్​ 27న రైలు ప్రమాదం జరిగింది. ఇందులో తల్లి, పిల్ల ఏనుగులు మరణించాయి. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం సంబంధిత రైలు ఇంజిన్​ను సీజ్​ చేశాం. కానీ ప్రజలకు అవసరమైన సేవలను దృష్టిలో ఉంచుకొని తిరిగి రైల్వే అధికారులకు అప్పగించాం. ఇందుకు పరిహారంగా న్యూ గువహటి సీనియర్​ అధికారి రూ.12 కోట్లు చెల్లిస్తామని చెప్పారు.

-అటవీ శాఖ అధికారులు

ఏనుగులు మరణించిన ఘటనలో ఇద్దరు లోకో పైలెట్​లను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది.

సీజ్​ చేసిన ఇంజిన్​తో అధికారులు
సీజ్​ చేసిన రైలు ఇంజిన్​
సీజ్​ చేసిన రైలు ఇంజిన్​

అసోంలో ఇలా రైలు పట్టాలపై ఏనుగులు చనిపోవడం కొత్తేమీ కాదు. వీటిని అరికట్టేందుకు అక్కడి అటవీ, రైల్వేశాఖల అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి: ఫ్లాట్​ఫామ్​ టికెట్​ రేటు భారీగా పెంపు

ABOUT THE AUTHOR

...view details