తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!

అసోంలో వరద ధాటికి మరో గ్రామం చెల్లాచెదురైంది. ఆయీ నదీ నీటి ప్రవాహంలో సీరంగ్ జిల్లా దబాబిల్ గ్రామంలో ఇళ్లు, పొలాలు నీటమునిగాయి. ప్రాణాలు చేత పట్టుకుని వలస వెళ్తున్నారు గ్రామస్థులు. ప్రభుత్వ సహకారమూ అందక సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.

By

Published : Jul 16, 2019, 5:50 PM IST

Updated : Jul 16, 2019, 7:28 PM IST

అసోం: వరదల్లో ఊరు ఊరంతా గంగ పాలైంది!

అసోం: వరదల్లో ఊరు ఊరంతా గంగ పాలైంది!

అసోంలోని సీరంగ్ జిల్లా దబాబిల్ గ్రామం ఆయీ నది పాలైంది. వరద ముంచెత్తి ఊరిని నాశనం చేసింది. పొలాల్లో నీరు, ఇసుక తప్ప ఏమి మిగల్లేదు. ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేసింది. గ్రామస్థులు నిలువ నీడ కోసం వెతుకుతూ వలస బాటపట్టారు.

వాతావరణం సహకరించక రాష్ట్ర విపత్తు స్పందన దళాలు(ఎస్డీఆర్​ఎఫ్​) ఈ గ్రామానికి చేరుకోలేకపోతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడి ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం అందలేదు.

అసోంవ్యాప్తంగా వరద బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్ల ప్రాణాలు బలిగొన్న వరదలు ఇంకా తగ్గుముఖం పట్టడంలేదు. నదుల్లో నీటి మట్టం పెరిగి తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.

ఇదీ చూడండి:నదిలో దూకి బాలికను కాపాడిన జవాన్లు

Last Updated : Jul 16, 2019, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details