తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం, బిహార్​లో పెరిగిన వరద ఉద్ధృతి - వరద

బిహార్‌, అసోంలో జలవిలయం కొనసాగుతోంది. ఇప్పటివరకు వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 198కు చేరింది. అసోంలో 75, బిహార్​లో 123 మంది మరణించారు. వరదల ప్రభావిత జిల్లాల సంఖ్య అసోంలో 18, బిహార్​లో 13కు పెరిగింది.

అసోం, బిహార్​లో పెరిగిన వరద ఉద్ధృతి

By

Published : Jul 26, 2019, 6:56 AM IST

అసోం, బిహార్​లో పెరిగిన వరద ఉద్ధృతి

బిహార్​, అసోం రాష్ట్రాల్లో నెలకొన్న వరద బీభత్సంలో మృతుల సంఖ్య 198కి చేరింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 2 కోట్ల మంది వరకు వరదల ప్రభావానికి గురయ్యారు. జల విలయం కొనసాగుతున్న జిల్లాల సంఖ్య బిహార్​లో 13, అసోంలో 18 కి పెరిగింది.

వరదల ధాటికి బిహార్​లో 123 మంది చనిపోగా.. అసోంలో 75 మంది ప్రాణాలు కోల్పోయారు.

అసోం..

కురిచ్చు నదిపై ఉన్న కురిచ్చు రిజర్వాయర్​ నుంచి నీటిని కిందికి వదలటం వల్ల 7 జిల్లాల్లో వరదల ఉద్ధృతి పెరిగింది. అందులో బార్​పేట, నల్బారి, బక్సా, చిరాంగ్​, కొక్రాఝర్​, దుబిడీ, దక్షిణ సల్మారా జిల్లా ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం 833 శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులను తరలిస్తున్నారు. బ్రహ్మపుత్ర, జియా భరాలి, పుథిమరి, మనాస్​, బేకి వంటి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నదుల పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి.

బిహార్​...

బిహార్​లో వరదల ప్రభావానికి గురైన జిల్లాల సంఖ్య 13కు చేరింది. సుమారు 12 వందల గ్రామాలు నీట మునిగాయి. 123 మంది మృతుల్లో అత్యధికంగా సితామరి జిల్లాలో 37, మధుబానిలో 30 మంది మరణించారు.

ఇదీ చూడండి: మాలో ఎలాంటి విభేదాలు లేవు: ఎంపీ భాజపా

ABOUT THE AUTHOR

...view details