అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అసోంలో 21 జిల్లాల్లోని 4,62,777 ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
21 జిల్లాల్లో ప్రభావం
దీహాజీ, లకింపూర్, బిస్వాంత్, ఉదల్‌గురి, దరాంగ్, నల్బరి, బార్పేట, చిరాంగ్, బొంగైగావ్, కోక్రజ్‌హార్, దక్షిణ సల్మారా, గోల్‌పారా, కమ్రప్, మొరిగావ్, నాగోన్, గోలఘాట్, జోర్హాట్, మజులి, శివసాగర్, దిబ్రుగఢ్, టిన్సుకియా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 61 రెవెన్యూ సర్కిళ్లు, 1289 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 109 పునరావాస శిబిరాల్లో 21 వేల 416 మంది తలదాచుకుంటున్నారు. 37 వేల 313 హెక్టార్లలో పంట నష్టం జరిగింది.
అసోంలో వరదల ఉద్ధృతం.. 21 జిల్లాల్లో ప్రభావం ఇదీ చూడండి:80 శాతం మునిగిపోయిన పొబిటోరా అభయారణ్యం