తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ వరదలు.. 3 లక్షల మందిపై తీవ్ర ప్రభావం - Assam flood affected people

అసోంలో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య మూడుకు చేరింది. సుమారు మూడు లక్షల మంది ప్రభావితమయ్యారు. వరదల వల్ల భారీగా పంట నష్టం సంభవించింది. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఆయా జిల్లాల అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Assam flood toll reaches 3, close to 3 lakh affected
అసోంలో భారీ వరదలు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య

By

Published : May 29, 2020, 11:03 AM IST

అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మృతుల సంఖ్య మూడుకు చేరింది. దాదాపు 3 లక్షల మంది ప్రభావితమైనట్లు అసోం విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

భారీగా పంట నష్టం

వరదల వల్ల 21,572 హెక్టార్ల మేర పంట నష్టం సంభవించింది. ఇళ్లు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. రహదారులన్నీ పాడైపోయాయి. అనేక చోట్ల నీటి ప్రవాహ ఉద్ధృతికి నదీ తీరం కోతకు గురవుతోందని అధికారులు తెలిపారు.

16 వేల మంది..

16వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 80 పునరావాస శిబిరాలకు వరద బాధితులను తరలించడానికి సంబంధిత జిల్లా అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటల వరకు బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహించిందని అధికారులు తెలిపారు.

అసోంలో భారీ వరదలు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఇదీ చూడండి:భారత్​లో ఒక్కరోజులో 7466 కేసులు, 175 మరణాలు

ABOUT THE AUTHOR

...view details