వరదల ధాటికి అసోం అతలాకుతలమవుతోంది. 21 జిల్లాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. 60 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలో 1771 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. 19,81,801 మంది ప్రభావితమయ్యారు. మరో వ్యక్తి మరణించగా.. మృతుల సంఖ్య 104కు ఎగబాకింది.
ప్రస్తుతం మరిగావ్, గోల్పారా, బార్పేట, ధెమాజీ జిల్లాల్లో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అసోంలో ఇప్పటివరకు 1,03,609,71 హెక్టార్ల పంట నీట మునిగిపోయింది. గోల్పారా, దర్రాంగ్ జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది.
21 జిల్లాలు జల దిగ్బంధం.. మరో వ్యక్తి మృతి బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీని వల్ల నదీ పరివాహక ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. ఫలితంగా కాజీరంగా, మానస్, ఆర్జీ ఆరెంజ్ జాతీయ పార్కులు, పాబితోరా, బుర్హాసపోరి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాల్లో భారీగా వరద నీరు ప్రవేశించింది. ఆహారం లభించకపోవడం వల్ల మూగ జీవులు విలవిల్లాడిపోతున్నాయి.
నివాస ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు నిలువ నీడ లేక దీనంగా ఉన్న పశువులు ఇదీ చూడండి:భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు