అసోంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం 26 జిల్లాల్లో వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. 27.64 లక్షల మందిపై ప్రభావం పడింది. పలు ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లు, వంతెనలు నేలమట్టమయ్యాయి.
తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా... రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 105కు చేరింది. వీరిలో కొండచరియలు విరిగి పడి మృతి చెందిన వారు కూడా ఉన్నారు. ఈ వరదల కారణంగా కజీరంగా జాతీయ పార్క్లో 90 మూగ జీవాలు మృతి చెందాయి.
- జల దిగ్బంధంలో మొత్తం 2,678 గ్రామాలు
- నీట మునిగిన 1,16,404 హెక్టార్ల పంట భూమి
- 21జిల్లాల్లో 649 శిబిరాల ఏర్పాటు
- 47,465 మందిని సురక్షిత కేంద్రాలకు తరలింపు