అసోంలో భారీ వర్షాల కారణంగా ఐదు జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఒక్కసారిగా వరదలు రావడం వల్ల 30వేల మందికి పైగా ఇబ్బందులకు గురయ్యారని అధికారులు తెలిపారు. లక్ష్మిపుర్, దేమాజీ, దిబ్రూగఢ్, డర్రాంగ్, గోపాల్పరా జిల్లాల్లోని 127 గ్రామాలు జలమయం అయ్యాయని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎస్డీఎంఏ)అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
భారీగా పంట నష్టం
వరద ప్రభావిత ప్రాంతాల్లో 33 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఏఎస్డీఎంఏ అధికారులు తెలిపారు. 8,941మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్లు వెల్లడించారు. సుమారు 500 హెక్టార్ల మేర పంట దెబ్బతిన్నట్లు తెలిపారు.