తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెదురు, వస్త్రాలతో అసోం సంప్రదాయ 'బుల్ ఫైట్'​

సంప్రదాయ 'బుల్ ఫైట్' అసోం వాసులు వినుత్నంగా నిర్వహించారు. వెదురు బొంగులు, వస్త్రాలతో కృత్రిమ ఎద్దుల ఆకృతులను తయారు చేసి వాటితో ఫైట్ చేయించారు. సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు వివరించేందుకే ఇలా చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

Assam Artificial Buffalo Fight
అసోం కృత్రిమ 'బుల్ ఫైట్'​- యువతకు సంప్రదాయాన్ని తెలిపేందుకే..

By

Published : Jan 16, 2021, 9:27 AM IST

Updated : Jan 16, 2021, 9:34 AM IST

అసోం కృత్రిమ 'బుల్ ఫైట్'​

అసోం సంప్రదాయంలో భాగమైన 'బుల్ ఫైట్'​ను శివసాగర్ జిల్లా అముగురి గ్రామ ప్రజలు వినూత్నంగా నిర్వహించారు. జంతువుల ఫైట్​ను గతంలో సుప్రీంకోర్టు నిషేధించటం వల్ల.. వెదురు బొంగులు, వస్త్రాలతో కృత్రిమంగా రెండు ఎద్దుల ఆకృతులను చేశారు. వాటిలో ఇద్దరు వ్యక్తులు దూరి ఎద్దులవలే ఒకరితో ఒకరు ఫైట్​ చేశారు.

ఇది నిజమైన బుల్ ఫైట్​ కాకపోయినా.. సరదాగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్దఎత్తున గుమిగూడారు.

దశాబ్దాలుగా అసోం సంస్కృతిలో భాగమైన బుల్​ ఫైట్​ను ప్రస్తుత యువతకు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఊరి పెద్దలు తెలిపారు.

Last Updated : Jan 16, 2021, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details