డీఎంకే ఎంపీ కనిమొళికి ఆదివారం చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. దిల్లీకి వెళ్తోన్న సమయంలో.. తాను భారతీయురాలినా? కాదా? అని ఓ సీఐఎస్ఎఫ్ అధికారి తనను ప్రశ్నించినట్లు ఆమె వెల్లడించారు. తనకు హిందీ రాదని.. తమిళం లేదా ఆంగ్ల భాషలో మాట్లాడమని అభ్యర్థించగా ఆ మహిళా అధికారి ఈ ప్రశ్న అడిగినట్టు తెలిపారు.
"నాకు హిందీ రాకపోవడం వల్ల తమిళం-ఆంగ్లంలో మాట్లాడమని కోరా. అసలు 'మీరు భారతీయురాలేనా?' అని ఆ అధికారి నన్ను ప్రశ్నించారు. భారతీయత అంటే హిందీ తెలిసి ఉండడం అని ఎప్పటి నుంచి పరిగణిస్తున్నారో తెలుసుకోవాలని ఉంది."
--- కనిమొళి, డీఎంకే నేత.