పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న వేళ ఆ ప్రయోజనాన్ని దేశ ప్రజలకు చేరవేయాలని ప్రధానిని తాను అడిగితే.. దానికి బదులుగా మన 'మేధావి' ధరలు పెంచారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి.. ఆ ప్రయోజనాన్ని భారతీయులకు అందించాలని నేను మూడు రోజుల క్రితమే ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరాను. ఆ సలహాను పట్టించుకోకుండా.. మన మేధావి చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.