కర్ణాటక ధార్వాడ్ జిల్లా రాయ్‌పుర్‌లోని 'అక్షయ పాత్ర'.. ఆసియాలోని అతిపెద్ద వంటశాలల్లో ఒకటి. రోజుకు 2లక్షల 50వేల భోజనాలు తయారు చేసే సామర్థ్యం దీని సోంతం. మొన్నటి వరకు మధ్యాహ్నం భోజనం కింద బడి పిల్లల కడుపు నింపిన అక్షయ పాత్ర.. ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీల ఆకలి కష్టాలను తీరుస్తోంది.
ఇన్ఫోసిస్ సహకారంతో...
ఇస్కాన్ కృష్ణాలయానికి సమీపంలో ఉన్న ఈ భారీ వంటశాలను 2006లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇచ్చిన నిధులతో నిర్మించారు.
ఒక ఎకరం విస్తీర్ణంలో ఉండే ఈ వంటశాలలో 2 టన్నుల సామర్థ్యంగల బాయిలర్, 600 లీటర్ల సామర్థ్యం కలిగిన 11 రైస్ కుక్కర్లు ఉన్నాయి. ఒక్కో కుక్కర్లో కేవలం 15 నిమిషాల్లో ఒక క్వింటా బియ్యాన్ని వండవచ్చు. 8 పెద్ద కంటైనర్లలో సాంబార్ తయారుచేస్తారు. ఒక్కో కంటైనర్ సామర్థ్యం 12,000 లీటర్లు. వీటిలో కేవలం 45 నిమిషాల్లోనే సాంబార్ సిద్ధమవుతుంది.
అక్షయపాత్ర వంటశాలలో ప్రతిరోజూ మూడు పూటలా వంటలు తయారవుతాయి. ఇందుకోసం మూడు షిఫ్టుల్లో 450 మంది పనిచేస్తారు. ఉదయం 3 గంటల నుంచి 9 గంటల వరకు ఆహారాన్ని వండుతారు. తరువాత వంటగదిని పూర్తిగా శుభ్రపరుస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మరోసారి వంటకాలు తయారు చేస్తారు.
మెనూ ప్రత్యేకత..