కరోనా మహమ్మారి కారణంగా వైద్య ప్రపంచానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు వైద్య నిపుణులు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ఓ కొవిడ్ రోగికి ఎంతో క్లిష్టమైన ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఫలితంగా ఆసియాలోనే మొదటిసారి ఈ ఆపరేషన్ చేసిన వారిగా ఘనత సాధించారు. దీనితో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ముగ్గురు కొవిడ్ రోగులకు మాత్రమే ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది.
ఈ శస్త్ర చికిత్సకు ఎంజీఎం ఆస్పత్రి ఛైర్మన్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ డైరెక్టర్ డా.కేఆర్ బాలక్రిష్ణన్ నేతృత్వం వహించారు. ఆయన ప్రత్యేక వైద్య నిపుణుల బృందంలో డా.సురేశ్ రావు, డా.శ్రీనాథ్, డా.అపర్ జిందాల్ ఉన్నారు.
దిల్లీ నుంచి..