తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆసియా టాప్​-100లో 8 భారతీయ విద్యాసంస్థలు

ఆసియాలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్​లను విడుదల చేసింది ప్రముఖ రేటింగ్ సంస్థ టైమ్స్ హయ్యర్​ ఎడ్యుకేషన్​. ఈ జాబితాలో మొదటి 100 స్థానాల్లో 8 భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి.

Asian University Rankings 2020
ఆసియా టాప్​-100

By

Published : Jun 9, 2020, 4:29 PM IST

బ్రిటన్​కు చెందిన 'టైమ్స్ హయ్యర్​ ఎడ్యుకేషన్'(టీహెచ్ఈ) 'ది ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్​- 2020' జాబితాను విడుదల చేసింది. మొదటి 100 విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్​కు చెందిన 8 విద్యాసంస్థలు చోటు సంపాదించాయి.

ఈ 8 విద్యాసంస్థల్లో ఆరు ఇండియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లే ఉన్నాయి. ఐఐటీలు కాకుండా బెంగుళూరులోని ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్​సీ), ముంబయిలోని ఇనిస్టిట్యూట్​ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) చోటు దక్కించుకున్నాయి.

సంస్థ ర్యాంక్​
ఐఐఎస్​సీ- బెంగళూరు 36
ఐఐటీ రూప్​నగర్​ 47
ఐఐటీ - ఇండోర్​ 55
ఐఐటీ- ఖరగ్​పుర్​ 59
ఐఐటీ- దిల్లీ 67
ఐఐటీ- బాంబే 69
ఐఐటీ- రూర్కీ 83
ఐసీటీ- ముంబయి- 92

ఈ ఏడాది ఖరగ్​పుర్​, దిల్లీ ఐఐటీలు చాలా మెరుగుపడ్డాయని టీహెచ్​ఈ వివరించింది. గతేడాది టాప్ 100 జాబితాలో లేని ఐఐటీ రూప్​నగర్​.. ఈసారి ఏకంగా 47 స్థానానికి చేరింది. బోధన, పరిశోధన, పరిశ్రమ ప్రమాణాల స్థాయిల్లో ఐఐటీల్లో నాణ్యత పెరిగిందని తెలిపింది.

తొలి 5 స్థానాల్లో..

  1. సింఘువా విశ్వవిద్యాలయం- చైనా
  2. పెకింగ్ యూనివర్సిటీ- చైనా
  3. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్
  4. యూనివర్సిటీ హాంకాంగ్​
  5. ది హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

ఇదీ చూడండి:అయోధ్యలో రామ మందిరానికి బుధవారమే పునాది

ABOUT THE AUTHOR

...view details