తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జులై 6 నుంచి తాజ్‌ సందర్శనకు అనుమతి - పురానఖిల్లా

ప్రఖ్యాత చారిత్రక కట్టడాలను జులై 6 నుంచి సందర్శించేందుకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ వెల్లడించారు. తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యాటకులు వీటిని తిలకించవచ్చని తెలిపారు.

ASI monuments to be reopened from July 6; visitors to be capped, masks mandatory: Cul min
6 నుంచి తాజ్‌మహల్‌ సందర్శనకు అనుమతి

By

Published : Jul 3, 2020, 7:28 AM IST

ప్రఖ్యాత కట్టడాలు తాజ్‌మహల్‌, ఎర్రకోట సహా అనేక స్మారక, సందర్శనీయ ప్రాంతాలను సోమవారం నుంచి తిరిగి తెరవనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యాటకులు వీటిని సందర్శించవచ్చని వెల్లడించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో 3,400కు పైగా సందర్శనీయ ప్రాంతాలను భారత పురావస్తు పరిశోధన సంస్థ (ఏఎస్‌ఐ) మార్చి 17న మూసేసింది. లాక్‌డౌన్‌ అమలు చేయడంతో దాదాపు జూన్‌ మధ్య వరకు అన్నీ మూసేశారు. అన్‌లాక్‌ 1 దశ మొదలైనప్పుడు దాదాపు 820 ఆధ్యాత్మిక ప్రాంతాలను పునః ప్రారంభించారు. మిగిలిన సందర్శనీయ కేంద్రాలను తెరిచేందుకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్‌ తీవ్రతను బట్టి తెరవాలో, మూసేయాలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని వెల్లడించింది.

'సాంచి (మధ్యప్రదేశ్‌), పురానా ఖిల్లా (దిల్లీ), ఖజురహో (ప్రపంచ వారసత్వ కట్టడం) చిత్రాలివి. తగిన జాగ్రత్తలు తీసుకొంటూ జులై 6 నుంచి వీటిని తెరిచేందుకు మేం నిర్ణయం తీసుకున్నాం' అని జోషి ట్వీట్‌ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి వేంకటేశ్వర‌ స్వామి ఆలయాన్ని గత నెల్లోనే తెరిచారు.

ఇదీ చూడండి:దుండగుల దాడిలో 8 మంది పోలీసులు మృతి

ABOUT THE AUTHOR

...view details