తెలంగాణ

telangana

ETV Bharat / bharat

27 ఏళ్లలో 52 బదిలీలు - haryana

27 ఏళ్ల వృత్తి జీవితంలో 52 సార్లు బదిలీ అయ్యారు హరియాణా కేడర్ ఐఏఎస్ అధికారి అశోక్​ ఖేమ్కా.

ఐఏఎస్ అధికారి అశోక్​ ఖేమ్కా

By

Published : Mar 4, 2019, 3:45 PM IST

తక్కువ సమయంలో ఎక్కువసార్లు బదిలీ అయిన ఐఏఎస్​ అధికారిగా గుర్తింపు పొందిన అశోక్ ఖేమ్కా మరోసారి వార్తల్లో నిలిచారు. హరియాణాలో 9 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎం మనోహర్​లాల్ ఖట్టర్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అందులో అశోక్​ పేరు ప్రముఖంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచింది.

1991 బ్యాచ్​ హరియాణా కేడర్​కు చెందిన ఐఏఎస్​ అధికారి అశోక్​ ఖేమ్మా. మొత్తం 27 ఏళ్ల వృత్తి జీవితంలో 52వ సారి బదిలీతో రికార్డు సృష్టించారాయన.

ప్రస్తుతం ఖేమ్కాను రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక విభాగంలో ప్రధాన కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం. గత నవంబర్​లోనే సామాజిక న్యాయం విభాగం నుంచి యువత, క్రీడల విభాగానికి బదిలీ అయ్యారు.

ఈ విషయంపై స్పందించిన ఖేమ్కా.. ఈ బదిలీలతో తల పేలిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:దేశమంతా శివమయం

ABOUT THE AUTHOR

...view details