కరోనా వైరస్ గబ్బిలాల ద్వారానే వ్యాపించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త గంగఖేడ్కర్ భావించారు.
కరోనాకు మూలం గబ్బిలాలే: ఐసీఎంఆర్ శాస్త్రవేత్త "కరోనా వైరస్ ముందుగా గబ్బిలాల నుంచి గబ్బిలాలకు వ్యాపించింది. తరువాత వాటి నుంచి పాంగోలిన్లకు సోకి ఉంటుంది. పాంగోలిన్ల నుంచి ఈ ప్రాణాంతక వైరస్ మానవులకు వ్యాపించి ఉండాలి." - గంగఖేడ్కర్, ఐసీఎంఆర్ శాస్త్రవేత్త
రెండు రకాల గబ్బిలాలు
ఐసీఎంఆర్ కూడా దీనిని పరిశీలించినట్లు గంగఖేడ్కర్ పేర్కొన్నారు. గబ్బిలాల్లో రెండు రకాలున్నాయని.. వీటికి కరోనా వైరస్ను మనుషులకు వ్యాపింపజేసే సామర్థ్యం లేదని గంగఖేడ్కర్ తెలిపారు. అయితే 1000 సంవత్సరాల కొకసారి ఇలా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఇది చాలా అరుదుగా జరుగుతుందని ఆయన మీడియాకు వెల్లడించారు.
ఇదీ చూడండి:'దేశంలో మొత్తం 170 హాట్స్పాట్ ప్రాంతాలు గుర్తింపు'