తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా సోకలేదు: చైనాలోని భారతీయులందరూ సేఫ్​' - sars virus news

చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్​.. ఆ​ దేశంలో నివసిస్తున్న భారతీయులెవరికీ సోకలేదని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో చైనాలోని భారతీయులందరినీ అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది.

As of now, no Indian in China affected by coronavirus outbreak: MEA
'కరోనా సోకలేదు: చైనాలోని భారతీయులందరూ సేఫ్​'

By

Published : Jan 27, 2020, 5:29 AM IST

Updated : Feb 28, 2020, 2:33 AM IST

చైనాలో నివాసముంటున్న భారతీయులెవరూ అత్యంత ప్రమాదకర కరోనా వైరస్​ బారిన పడలేదని స్పష్టం చేసింది భారత విదేశాంగశాఖ. కరోనాపై డ్రాగన్​ విశ్వవిద్యాలయాల్లోని భారతీయ విద్యార్థులను కూడా అప్రమత్తం చేసినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ తెలిపారు.

"భారత్​ కూడా చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతానికి భారతీయులెవరూ కరోనా వైరస్కు గురికాలేదు. వారందిరికీ ఆహారం, నీటి సౌకర్యం అందుబాటులో ఉన్నాయని అర్థమైంది."

-రవీశ్​ కుమార్​, విదేశాంగ ప్రతినిధి

చైనాలోని భారతీయుల సమస్యలకు స్పందించేందుకు అందుబాటులో మూడు హెల్ప్​లైన్​ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ధాటికి ఇప్పటివరకు మృతుల సంఖ్య 80కి చేరింది. విదేశాల్లో 23 మందితో సహా సహా మొత్తం 2వేలకు పైగా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. గతేడాది డిసెంబరులో హుబీ రాష్ట్రంలోని వుహాన్​ నగరంలో ఈ వైరస్​ను కనుగొన్నారు అధికారులు. వైరస్​ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశంలోని 12 నగరాలను మూసేశారు. పరిస్థితిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు విదేశాగ ప్రతినిధి రవీశ్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చూడండి: 71వ గణతంత్ర భారతావని... ఎంపికైన పద్మ గ్రహీతలు వీరే

Last Updated : Feb 28, 2020, 2:33 AM IST

ABOUT THE AUTHOR

...view details