తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత్​ ఆతిథ్యం - లేటెస్ట్​ న్యూస్​ ఇన్​ ఇండియా

తొలిసారి షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్(కౌన్సిల్​ ఆఫ్​ హెడ్స్​ ఆఫ్​ గవర్న్​మెంట్​)కు నవంబర్​ 30న ఆతిథ్యమివ్వనుంది భారత్​. ఈ మేరకు 8 సభ్యదేశాలకు ఆహ్వానం పంపింది. ఆయా దేశాల ప్రధానమంత్రులు వర్చువల్​గా భేటీలో పాల్గొంటారు.

As host, India invites SCO member countries for virtual summit on Nov 30
షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత్​ ఆతిథ్యం

By

Published : Nov 13, 2020, 6:20 AM IST

ఈ ఏడాది జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సభ్య దేశాల ప్రభుత్వాధినేతల మండలి వార్షిక సమావేశానికి భారత్​ మొదటిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఎస్​సీఓ కౌన్సిల్​ ఆఫ్​ హెడ్స్​ పేరిట నవంబర్​ 30న ఈ సదస్సును వర్చువల్​గా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్​సీఓలోని 8 సభ్య దేశాలను భారత్​ ఆహ్వానించినట్లు స్పష్టం చేశారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ.

ఆయా దేశాల ప్రధానమంత్రులు/విదేశాంగ మంత్రులు ఈ భేటీకి వర్చువల్​గా హాజరుకానున్నట్లు తెలిపారు. నవంబర్​ 10న సదస్సును రష్యా వర్చువల్​ ఫార్మాట్​లో జరిపింది.

2017లో భారత్​, పాకిస్థాన్​ ఎస్​సీఓలో శాశ్వత సభ్యదేశాలుగా గుర్తింపు పొందాయి. రష్యా, చైనా, కజకిస్థాన్​, కిర్గిజ్​స్థాన్​, తజికిస్థాన్​, ఉజ్బెకిస్థాన్​ మిగతా దేశాలుగా ఉన్నాయి.

నాటోకు పోటీగా ఏర్పడిన ఎస్​సీఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా నిలిచింది. శాంతి, స్థిరత్వం, భద్రతను పెంపొందించడమే దీని లక్ష్యం.

ABOUT THE AUTHOR

...view details