తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అసత్యాలు చెప్పడం రాహుల్​ దృష్టిలో ఓ హక్కు' - ఆర్థిక మంత్రి

రాహుల్​ గాంధీపై ట్విట్టర్​ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రఫేల్​ అంశంలో సుప్రీంకోర్టు తీర్పును రాహులే సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

అరుణ్​ జైట్లీ

By

Published : Apr 15, 2019, 5:54 PM IST

అసత్యాలు చెప్పడం కూడా కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ దృష్టిలో ఓ హక్కేనని ఎద్దేవా చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ. రాజకీయ ప్రయోజనాల కోసం రఫేల్​పై సుప్రీం తీర్పును రాహుల్​ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రఫేల్​పై వ్యక్తిగత వ్యాఖ్యలను సుప్రీం చెప్పినట్టుగా రాహుల్​ గాంధీ తప్పుగా ఆపాదించారని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడిన నేపథ్యంలో ట్విట్టర్​లో స్పందించారు జైట్లీ.

"రాహుల్​ గాంధీ రాజకీయంలో... స్వేచ్ఛగా మాట్లాడే హక్కులో అసత్యాలు చెప్పే హక్కు భాగమే."
--ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ ట్వీట్​

రాజ వంశీకులు కూడా సుప్రీంకోర్టుకు లోబడే ఉండాలని రాహుల్​ను ఉద్దేశించి అన్నారు జైట్లీ.

"సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా సృష్టించేందుకు భారత ప్రజాస్వామ్యం అంగీకరించదు. రాజకీయం కోసం సుప్రీం ఉత్తర్వులను తిరగరాయాలనుకోవడం రాహుల్​ గాంధీ కొత్త పతనం. ఆయనెంత దిగజారుతున్నారో, మేమంత ఉన్నతస్థానానికి వెళతాం."
-- ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details