తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుణాచల్ ​ప్రదేశ్​లో వంతెన నిర్మించిన చైనా!

అరుణాచల్ ​ప్రదేశ్​ ఎంపీ తపిర్​ గావ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోకి చైనా దళాలు చొరబడి వంతెన నిర్మించాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను భారత సైన్యం ఖండించింది.

అరుణాచల్ ​ప్రదేశ్​లో వంతెన నిర్మించిన చైనా!

By

Published : Sep 5, 2019, 7:28 AM IST

Updated : Sep 29, 2019, 12:11 PM IST

అరుణాచల్ ​ప్రదేశ్​లో వంతెన నిర్మించిన చైనా!

అరుణాచల్ ​ప్రదేశ్​లోకి చైనా దళాలు చొరబడ్డాయని ఆ రాష్ట్ర ఎంపీ తపిర్​ గావ్​ పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రంలో చైనీయులు వంతెన కూడా నిర్మించారన్నారు.

ఆగస్టు నెలలో చైనా దళాలు భారత్​లోకి చొరబడి చగ్లామ్ గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలోని కయొమ్రు నుల్లాపై వంతెన నిర్మించాయని ఆరోపించారు గావ్​. స్థానిక యువకులు మంగళవారం ఆ వంతెన గుర్తించారన్నారు.

అరుణాచల్​ప్రదేశ్​ ఎంపీ వ్యాఖ్యలను భారత సైన్యం ఖండించింది. ఎంపీ తెలిపిన ప్రాంతాన్ని 'ఫిష్​ టెయిల్​'గా పరిగణిస్తారని సైన్యం వెల్లడించింది. నుల్లా​ ఒక కొండ ప్రాంతమని.. అక్కడ వాహనాలు ప్రయాణించలేవని ఓ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో రాకపోకలు కాలినడకనే సాగుతాయని వివరించారు. వర్షాకాలంలో తమ కదలికల కోసం గస్తీ కాసే భద్రతా సిబ్బంది తాత్కాలిక వంతెనలను నిర్మిస్తారన్నారు. ఆ ప్రాంతంలో చైనా సైనికులు, ఆ దేశ ప్రజల ఉనికి లేదని స్పష్టం చేశారు. కేవలం భారత సైన్యమే అక్కడ నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

దాదాపు 4వేల కిలోమీటర్ల సరిహద్దును భారత్​-చైనా పంచుకుంటున్నాయి. కానీ విభజన సరిగా కాకపోవడం వల్ల కొన్నిసార్లు 'చొరబాటు' వివాదాలు తలెత్తుతున్నాయి.

ఇదీ చూడండి- రష్యా: తూర్పు తీర సంస్కృతులకు మోదీ ఫిదా

Last Updated : Sep 29, 2019, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details