తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి- మోదీ దిగ్భ్రాంతి

అరుణాచల్​ ప్రదేశ్​లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందటంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు.

Arunachal landslides
కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి- మోదీ దిగ్భ్రాంతి

By

Published : Jul 11, 2020, 6:36 AM IST

Updated : Jul 11, 2020, 6:56 AM IST

అరుణాచల్​ ప్రదేశ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు మరణించటంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

"కొండచరియలు విరిగిపడి పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి​

బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.

పాపుమ్​ పరే జిల్లాలోని టిగ్డోలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 నెలల శిశువుతో సహా.. నలుగురు దుర్మరణం చెందారు. పాసిఘాట్​లోని సిబో కోరింగ్​ నదిలో చిక్కుకున్న ఓ జంటను రక్షించారు సహాయక సిబ్బంది.

ఇదీ చదవండి:సరిహద్దుల్లో శాంతి స్థాపనకు భారత్​, చైనా అంగీకారం

Last Updated : Jul 11, 2020, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details