అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ తన సొంత నియోజకవర్గ పర్యటన సందర్భంగా సుమారు 24 కిలోమీటర్ల దూరం కాలినడక సాగించారు. తవాంగ్ జిల్లాలోని ముక్తోలో మారుమూల గ్రామ ప్రజలను కలుస్తూ సుమారు 11 గంటలు నడిచారు. తవాంగ్‌లో నడక ప్రారంభించిన సీఎం.. పర్వత ప్రాంతం నుంచి సుమారు 97 కిలోమీటర్లు ప్రయాణించి లుగుతాంగ్ గ్రామానికి చేరుకున్నారు.
మారుమూల గ్రామ పర్యటన కోసం 24కి.మీ నడిచిన సీఎం - అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి
అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమాఖండూ.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలను కలిసేందుకు సుమారు 24 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆయన.. 11 గంటలపాటు నడిచి ఓ చిన్న గ్రామంలోని ప్రజలను కలిశారు.
మారుమూల గ్రామ పర్యటన కోసం 24కి.మీ నడచిన సీఎం
సముద్ర మట్టానికి సుమారు 14,500 అడుగుల ఎత్తులో ఉన్న లుగుతాంగ్లో కేవలం పది ఇళ్లు ఉంటాయి. 50 మంది నివాసం ఉంటారు. ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆ గ్రామానికి సీఎం కాలినడకన వెళ్లి సమీక్షించడం విశేషం. ఖండూతో పాటు తవాంగ్ ఎమ్మెల్యే షం రింగ్ తాషి కూడా ఉన్నారు.
ఇదీ చదవండి:కరోనా అనంతరం తలెత్తే సమస్యలపై 'ఫోన్ సర్వే'