తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుణాచల్​​లో మళ్లీ భాజపా సర్కారే!

అరుణాచల్ ప్రదేశ్​లో లోక్​సభ స్థానాలతో పాటు.. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లోనూ భాజపా మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది.

By

Published : May 23, 2019, 6:07 PM IST

అరుణాచల్​లో భాజపానే

ప్రకృతి అందాలకు నెలవైన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్​ప్రదేశ్​లో కమలం ప్రభంజనం కొనసాగుతోంది. లోక్​సభతో పాటు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది.

సూర్యుడు ఉదయించే రాష్ట్రంలో క్రితం ఎన్నికలతో పోలిస్తే తాజాగా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2014 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

రెండు సంవత్సరాలు గడవగానే 2016లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. చివరకు... పాలనా పగ్గాలే చేతులు మారాయి. పీపుల్స్​ పార్టీ ఆఫ్​ అరుణాచల్​(పీపీఏ)కు చెందిన 33మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి నాటకీయ పరిణామాల అనంతరం జరిగిన ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భాజపా ప్రచారం..

అభివృద్ధే ప్రధానాంశంగా భాజపా ఎన్నికల బరిలో దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా... రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు.

అరుణాచల్​ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన నేషనల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీపీ)... తాము పోటీచేయని స్థానాల్లో భాజపాకు మద్దతు ప్రకటించింది.

విపక్షాల విమర్శలు...

పౌరసత్వ బిల్లు, శాశ్వత నివాస ధ్రువీకరణ అంశాలపై విపక్షాలు ప్రచారం నిర్వహించాయి. అవినీతి, శాంతి భద్రతలూ ప్రధాన అజెండాగా మార్చుకున్నాయి. అయితే వీటిని ప్రజలు విశ్వసించలేదని ఫలితాలను బట్టి తెలుస్తోంది.

పనిచేయని ప్రత్యేక హోదా...

ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పక్షాన్ని ఢీ కొట్టటానికి ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే అరుణాచల్​ప్రదేశ్​కు హోదా ఇస్తామంటూ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రకటించినప్పటికీ ఓటర్లు మొగ్గుచూపలేదు.

ఇదీ చూడండి:

కంచుకోట వయనాడ్​లో రాహుల్​ జయభేరి

ABOUT THE AUTHOR

...view details