తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైట్లీ ఆరోగ్యం విషమం!.. అమిత్​ షా పరామర్శ - ఎయిమ్స్​

కేంద్ర మాజీ మంత్రి అరుణ్​జైట్లీని... భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్​షా పరామర్శించారు. ఆయనతో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్​ కూడా ఉన్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందన్న వార్తల నేపథ్యంలో భాజపా నేతలు ఎయిమ్స్​కు చేరుకుంటున్నారు.

అరుణ్​జైట్లీని పరామర్శించిన అమిత్​షా, హర్షవర్ధన్

By

Published : Aug 17, 2019, 12:06 AM IST

Updated : Sep 27, 2019, 6:11 AM IST

ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న భాజపా సీనియర్ నేత అరుణ్​జైట్లీని.... కేంద్ర హోంమంత్రి అమిత్​షా పరామర్శించారు. ​జైట్లీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అరుణ్​ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తల నేపథ్యంలో భాజపా నేతలు ఎయిమ్స్​కు చేరుకుంటున్నారు.

అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆరా తీశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​ కూడా ఎయిమ్స్​కు చేరుకుని జైట్లీని పరామర్శించారు.

ఎయిమ్స్​లో చికిత్స

శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న అరుణ్​ జైట్లీని ఈ నెల 9న కుటుంబ సభ్యులు ఎయిమ్స్​లో చేర్చారు. గతేడాది మేలో కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ... అంతకు ముందు బేరియాట్రిక్ శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. ఇటీవల ఆయనకు అరుదైన కేన్సర్ సోకినట్లు గుర్తించారు.

ఇదీ చూడండి: రాజస్థాన్​లో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి

Last Updated : Sep 27, 2019, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details