దేశంలోనే ఎత్తైన వాల్ పెయింటింగ్ వేసిన రికార్డు సృష్టించిన మునీర్బుఖర్జీ.. యూపీ నోయిడాలో 15 అంతస్తుల భవనంపై గాంధీ మహాత్ముని వర్ణచిత్రాన్ని గీశాడు.
గుజరాత్ రాజ్‌కోట్‌లోని గోండల్కు చెందిన మునీర్‌కు బాల్యం నుంచే వాల్ పెయింటింగ్ అంటే మహా ఇష్టం. బాగా చదువుకుని ఎప్పటికైనా గొప్ప వాల్ పెయింటర్ కావాలనేది ఆయన కల. కానీ, ఆర్థిక స్తోమత సరిగ్గా లేక తొమ్మిదో తరగతిలోనే చదువు మానేశాడు మునీర్. అయితే, ఎన్ని కష్టాలు వెంటాడినా తన ఆసక్తిని మాత్రం వీడలేదు. చిన్న చిన్న గోడలపై, వాహనాలపై చిత్రాలు గీయడం సాధన చేశాడు.