కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం అన్ని రంగాల్లోనూ విస్తృతమవుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. వీరిలో విద్యార్థులతోపాటు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీరందరికీ సాయపడేలా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సును అందిస్తోంది. ఆన్‌లైన్‌లో ఉచితంగా నిర్వహిస్తున్నారు. దీనిని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లుగా చెబుతున్నప్పటికీ, ఆసక్తి ఉన్నవారెవరైనా చేరగలిగే వీలు కల్పించారు.
15 వారాల కోర్సు
కోర్సును యూజీసీ మూక్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇది ఎంహెచ్‌ఆర్‌డీ స్వయంకు సంబంధించిందే. కోర్సు వ్యవధి 15 వారాలు. 36 లెర్నింగ్ మాడ్యూళ్లు ఇందులో ఉన్నాయి. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా వివరిస్తూ రూపొందించారు. ప్రతి మాడ్యూల్ ఈ-టెక్స్ట్, సెల్ఫ్ లర్నింగ్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ-టెక్స్ట్ పీడీఎఫ్‌ల రూపంలో ఉంటుంది. వీటిని డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు. సెల్ఫ్ లెర్నింగ్‌లో వీడియోలు అందుబాటులో ఉంటాయి.
ఇక్కడ చూడండి..
ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్‌లో సైన్‌అప్ అయ్యి జాయిన్ కావచ్చు. కోరుకున్నది నేర్చుకోవచ్చు. వివరాలకు