తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ ఆంక్షలపై సుప్రీం తీర్పు వాయిదా

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​లో విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్​ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

Article 370: SC reserves verdict on pleas challenging curbs in J-K
కశ్మీర్​ ఆంక్షలపై సుప్రీం తీర్పు వాయిదా

By

Published : Nov 27, 2019, 1:05 PM IST

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. ఇందులో కాంగ్రెస్​ సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్​ వ్యాజ్యం కూడా ఉంది.

జాతీయ భద్రతకు సంబంధించి జమ్ముకశ్మీర్​లో సమస్యలు ఉన్నప్పటికీ.. 70లక్షల మందిపై ఆంక్షలు విధించడం సరికాదని ఆజాద్​ తరఫు న్యాయవాది కపిల్​ సిబాల్​ అత్యున్నత న్యాయస్థానంలో వాదించారు.

అప్పటి జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే​ ఆర్టికల్​ 370 రద్దు అనంతరం లోయలో ఆంక్షలు విధించడాన్ని అక్కడి అధికార యంత్రాంగం సమర్థించింది. పాకిస్థాన్​ సైన్యం, వేర్పాటువాదులు, ఉగ్రవాదులు.. జిహాద్​ పేరుతో అలజడి సృష్టించడానికి ప్రయత్నించడం వల్లే కశ్మీర్​లో అంతర్జాల సేవలను నిలిపివేసినట్టు వాదించింది. ఆంక్షల వల్లే ఒక్క ప్రాణం కూడా పోలేదని.. ఒక్క బులెట్​ను కూడా ఉపయోగించలేదని తెలిపింది.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.

ఇదీ చూడండి:- ప్రత్యర్థుల 'మహా మైత్రి'పై అజిత్ ఇలా... దేవేంద్ర అలా...

ABOUT THE AUTHOR

...view details