పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అక్కడి అధికారులు. లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనపై 34 ఏళ్ల కిందటి అక్రమ భూ కేటాయింపుల కేసులో అరెస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 1986లో పాక్‌లోని పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో.. జంగ్ వార్తా సంస్థ నిర్వాహకుడు షకీల్ ఉర్ రెహమాన్‌కు అక్రమంగా భూ కేటాయింపులు చేశారని నవాజ్‌పై ఆరోపణలు ఉన్నట్లు ఆ దేశ అవినీతి వ్యతిరేక విభాగం పేర్కొంది.
"జాతీయ అవినీతి వ్యతిరేక విభాగం.. పీఎంఎల్ఎన్ అధినేత నవాజ్ షరీఫ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జంగ్ సంస్థ నిర్వాహకుడు షకీల్ ఉర్ రెహమాన్‌కు అక్రమంగా భూ కేటాయింపులు చేయడంలో నవాజ్ జోక్యం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులిచ్చాం.. మా ప్రశ్నలకు సమాధానాలివ్వాలని కోరాం. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు."