పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 30 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వీరితో పాటు మరో 50 మంది పార్లమెంటు సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడ్డట్టు తేలింది.
30 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ - ఇద్దరు వైకాపా ఎంపీలకు కరోనా
పార్లమెంటు సమావేశాల వేళ ఎంపీల్లో కరోనా కలకలం రేపింది. ఏకంగా 30 మంది పార్లమెంట్ సభ్యులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 50 మంది పార్లమెంటు సిబ్బందికి కరోనా ఉన్నట్లు తేలింది.
వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ సభ్యులు, సిబ్బందికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. ఈ తరుణంలో వీరికి నిర్వహించిన పరీక్షల్లో 30 మంది సభ్యులకు, 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకినవారిలో ఎక్కువ మంది అధికార భాజపాకు చెందినవారు కాగా.. వైకాపా సభ్యులు ఇద్దరు, ఆర్ఎల్పీ, శివసేన, డీఎంకే నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.
వైకాపా ఎంపీల్లో గొడ్డేటి మాధవి, రెడ్డప్ప.. భాజపాలో అనంత కుమార్ హెగ్డే, మీనాక్షి లేఖి, పర్వేశ్ సాహిబ్ సింగ్ ఉన్నారు. వీరిని క్వారంటైన్లో ఉండాలని సూచించారు అధికారులు. నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే పార్లమెంటులోకి అనుమతిస్తున్నారు.