బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై అరెస్టయిన అర్ణబ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో అర్ణబ్‌తో పాటు మరో ఇద్దరిని అలీబాగ్ పోలీసులు నవంబర్ 4న అరెస్ట్ చేశారు.
బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు అర్ణబ్ గోస్వామి - arnab goswami moves sc
బాంబే హైకోర్టు బెయిల్ తిరస్కరించడం వల్ల రిపబ్లిక్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లి ఆత్మహత్య కేసులో పోలీసులు అర్ణబ్‌ను అరెస్ట్ చేశారు.
![బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు అర్ణబ్ గోస్వామి Arnab Goswami moves SC against Bombay HC order refusing interim relief in 2018 suicide case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9499264-10-9499264-1605003185642.jpg)
బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు అర్ణబ్ గోస్వామి
అర్ణబ్ తాజాగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ముంబయి పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. ఇలా ఉంటే బాంబే హైకోర్టు సూచన మేరకు కింది న్యాయస్థానం అయిన రాయ్‌గఢ్ సెషన్స్ కోర్టులో కూడా బెయిల్ దాఖలు చేశారు.