తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​తో ప్రత్యక్ష యుద్ధానికి సైన్యం సిద్ధమైందా..! - ఉద్రిక్తత

పుల్వామాలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్​పై పూర్తిస్థాయి యుద్ధం చేయడానికి నాడు భారత సైన్యం సిద్ధపడిందా? ఈ మేరకు సైన్యాధిపతి జనరల్ బిపిన్​ రావత్​ కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచారా? ఉన్నతస్థాయి సైనిక వర్గాలు దీనికి ఔననే సమాధానం చెబుతున్నాయి.

పాక్​తో ప్రత్యక్ష యుద్ధానికి సైన్యం సిద్ధమైందా..!

By

Published : Aug 20, 2019, 7:10 AM IST

Updated : Sep 27, 2019, 2:53 PM IST

పాకిస్థాన్​లోని బాలాకోట్​పై భారత వైమానిక దళం దాడి చేయడానికి ముందు మన సైన్యాధిపతి బిపిన్ రావత్​ కేంద్రం ముందు ఓ ప్రతిపాదన ఉంచారట. ఉన్నతస్థాయి సైనిక వర్గాల సమాచారం మేరకు.. సర్కారు అనుమతిస్తే పాకిస్థాన్​లోకి చొచ్చుకెళ్లి ప్రత్యక్ష యుద్ధం చేస్తామని రావత్​ కోరారట.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాక్​ను తగు రీతిలో శిక్షించేందుకు వైమానిక దాడులు సహా పలు మార్గాలను ప్రభుత్వం అన్వేషించింది.

ఆ సమయంలో రావత్​ తన బలగం సన్నద్ధత గురించి ప్రభుత్వ పెద్దలకు తెలియజేశారు. పదవీ విరమణ పొందుతున్న పలువురు సైనికాధికారులతో సోమవారం రహస్యంగా సమావేశమైనప్పుడు ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు.

సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. పాకిస్థాన్​తో సంప్రదాయ పద్ధతిలో భూతల యుద్ధానికి సిద్ధమని రావత్​ నాడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

Last Updated : Sep 27, 2019, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details