సరిహద్దు వెంబడి పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతోంది. శుక్రవారంజమ్ముకశ్మీర్లోనిరాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు.
కల్‌సియా గ్రామం వద్ద ఉన్న సైనిక స్థావరంలో జవాను పహారా కాస్తుండగా పాక్ దళాలు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో జవాను తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన సైనిక ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పాకిస్థాన్ కాల్పులకు భారత్ దీటుగా స్పందించింది.