తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం - ముష్కరుడు

Two soldiers were injured in an encounter that broke out between militants and Indian Army in Pulwama district in the wee hours of Tuesday. Indian Army and Jammu and Kashmir Police launched a joint operation 'Kamrazipora' on Tuesday evening in Budgam. The area has been cordoned and firefighting ensued.

Army, Police's joint operation 'Kamrazipora' underway in JK's Budgam
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం

By

Published : Aug 12, 2020, 8:47 AM IST

Updated : Aug 13, 2020, 12:27 AM IST

23:33 August 12

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

భద్రతా దళాల కాల్పుల్లో మరణించింది హిజ్బుల్​ ముజాహిదీన్​కు చెందిన కీలక ఉగ్రవాది అజాద్​ అహ్మద్​ లోనే అలియాస్​ అజాద్​ లాల్​హరి అని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్​ తెలిపారు. ఈ ఏడాది మే 22న పుల్వామా ప్రిచులో పోలీస్ హెడ్​ కానిస్టేబుల్​ను హత్య చేసిన ఘటనలో అతనికి సంబంధాలున్నట్లు పేర్కొన్నారు. అతనిపై 6 ఎఫ్​ఐఆర్​లు నమోదైనట్లు వెల్లడించారు.

ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాను ఉత్తర్​ ప్రదేశ్​ జౌన్​పుర్​కు చెందిన సోవర్​ జిలజీత్​ సింగ్ యాదవ్​ అని అధికారులు చెప్పారు.

 

08:38 August 12

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా కమ్రాజిపొరా వద్ద ఎన్​కౌంటర్​ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, గ్రనేడ్లు, ఇతర మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముష్కర వేట కొనసాగుతోంది. 

ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కమ్రాజిపొరాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

Last Updated : Aug 13, 2020, 12:27 AM IST

ABOUT THE AUTHOR

...view details