పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ బందిపొర్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఓ భారత జవాన్ మృతిచెందాడు.
పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి - bharat pak firing latest
పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోమారు ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్‌లోని బందిపొర్లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాని ఉల్లంఘించింది. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.

పాక్ అప్రకటిత కాల్పులు.. భారత జవాను మృతి
గురేజ్ సెక్టార్లో పాకిస్థాన్ దళాలు ఆకస్మిక కాల్పులకు పాల్పడ్డాయి. పాక్ చర్యలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుడి త్యాగానికి సైన్యం సలాం చేస్తున్నట్లు ప్రకటించారు సైనికాధికారులు.