జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బారాముల్లా పత్తన్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ సైనికాధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. అనంతరం.. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం - firing in Baramulla between army and militants
జమ్ముకశ్మీర్ బారాముల్లాలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన సైనిక బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికాధికారి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది సైన్యం.
ఉగ్ర కాల్పుల్లో భారత జవానుకు గాయాలు!
యెదిపోరా పత్తన్లో ఉగ్ర శిబిరాలున్నాయనే సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు కలిసి తనిఖీలు నిర్వహించారు. బలగాలను చూసి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. భారత సైనికులు ఎదురుకాల్పులకు దిగారు.
ఇదీ చదవండి: చైనా కుట్రలకు దీటుగా భారత్ సరికొత్త వ్యూహాలు!
Last Updated : Sep 4, 2020, 7:37 PM IST