మూడేళ్ల పాటు 'టూర్ ఆఫ్ డ్యూటీ' కింద సాధారణ పౌరులను ఆర్మీలో చేర్చుకునేందుకు భారత సైన్యం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు భారత సైన్యం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. భారత్లోని ఉత్తమ ప్రతిభను దేశ సేవకు వినియోగించుకునే విధంగా ఈ ప్రతిపాదన ఉండనున్నట్టు పేర్కొన్నారు.
సైన్యంలో మూడేళ్లపాటు 'సామాన్యుడి' సేవలు!
సాధారణ పౌరులను 'టూర్ ఆఫ్ డ్యూటీ' కింద మూడేళ్ల పాటు ఆర్మీలో చేర్చుకునే యోచన చేస్తోంది భారత సైన్యం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
సైన్యంలో సామాన్యుడి సేవల ప్రతిపాదనపై పరిశీలన
ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి 'షార్ట్ సర్వీస్ కమిషన్'ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. భారత సైన్యంలో కొన్ని సంవత్సరాలుగా అధికారుల కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించి యువతను ఆకర్షించేందుకు ఆర్మీ అడుగులేస్తోంది.
'షార్ట్ సర్వీస్ కమిషన్' పద్దతిని గతంలో ఐదేళ్ల కాల పరిమితితో ప్రవేశపెట్టింది సైన్యం. ప్రస్తుతం ఇందుకు మరింత బలం చేకూర్చేలా 10 సంవత్సరాలకు పొడిగించింది.