రక్షణ రంగంలో సమాచార భద్రత కోసం భారత ఆర్మీ కీలక చర్యలు తీసుకుంది. 'సాయ్(సెక్యూరిటీ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్)' పేరుతో ఓ మెసేజింగ్ యాప్‌ను భారత ఆర్మీ.. గురువారం ఆవిష్కరించింది. సైనికుల ఫోన్‌కాల్స్, సందేశాలు, వీడియో కాల్స్ వంటి వాటికి రక్షణ కల్పించేలా ఈ యాప్‌ను రూపొందించారు.
"సాయ్ కూడా వాట్సాప్, టెలిగ్రామ్, సంవాద్, జిమ్స్ లాగానే పని చేస్తుంది. దీనిలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సదుపాయం ఉంటుంది. ఆర్మీలో సేవలందించే వాళ్లందరూ ఈ యాప్‌ను ఉపయోగించేలా రూపొందించాం. ఆండ్రాయిడ్ వేదికగా ఇది పని చేస్తుంది."
--భారత సైన్యం.
ఆర్మీ సైబర్ గ్రూప్, సీఈఆర్టీ(కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) సంస్థ కలసి ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి.
పనుల్లో పారదర్శకత కోసం..