తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నియంత్రణ రేఖ వెంబడి భీకర కాల్పులు- జవాను మృతి - ARMY JAWAN DEATH

జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లాలో భారత దళాలు-చొరబాటుదారుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి సాగుతున్న ఈ కాల్పుల్లో ఓ భారత జవాను అమరుడయ్యాడు. చొరబాటుదారులకు పాకిస్థాన్​ సహాయం చేస్తోందని భారత అధికారులు అనుమానిస్తున్నారు.

Army jawan killed in gunfight at LoC
నియంత్రణ రేఖ వెంబడి భీకర కాల్పులు- జవాను మృతి

By

Published : Dec 16, 2019, 10:45 PM IST

Updated : Dec 16, 2019, 11:56 PM IST

జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత సైన్యం- చొరబాటుదారుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.

అక్రమ చొరబాటుదారులకు పాకిస్థాన్​ సైన్యం సహాయం చేస్తున్నట్టు భారత్​ అనుమానిస్తోంది. వారికి మద్దతుగా భారత్​ సైన్య శిబిరాలపై పాక్​ కాల్పులు జరపడమే ఇందుకు కారణం.

సుందర్​బానీ సెక్టార్​లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన అనంతరం అప్రమత్తమవడం వల్ల.. చొరబాటుదారుల చర్యలను సమర్థంగా తిప్పికొట్టగలిగింది భారత దళం.

మరో జవాను...

అంతకుముందు.. జమ్ముకశ్మీర్​లోని బందిపొరలో ​ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.

Last Updated : Dec 16, 2019, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details