పాక్ దుశ్చర్య..
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా షాపుర్-కెన్రీ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపాయి దాయాది బలగాలు. ఈ ఘటనలో ఓ భారత జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
"శనివారం రాత్రి షాపుర్-కెన్రీ సెక్టార్లో కాల్పులు, దాడులకు పాల్పడింది పాక్. వారికి దీటైన సమాధానం ఇచ్చాయి భారత బలగాలు. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించిన క్రమంలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు."