పాక్‌కు దీటుగా జవాబు..
జమ్ముకశ్మీర్‌లోని నౌషిరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ అమరుడయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భారత జవాన్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల పాక్ వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాక్ చర్యలకు భారత సైనికులు దీటుగా సమాధానమిచ్చారు. సోమవారం తెల్లవారుజామున భారత్-పాక్ బలగాల మధ్య దాదాపు రెండు గంటలపాటు కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.