పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలో నియంత్రరేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
చిన్న ఆయుధాలు, మోర్టార్ షెల్లింగులతో పాక్ సైన్యం కాల్పులు చేసినట్లు ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. కృష్ణఘాటి, మన్కోటే సెక్టార్లలో బుధవారం రాత్రి కాల్పులు ప్రారంభించినట్లు చెప్పారు. అయితే పాక్ కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు.