2016 సెప్టెంబర్ 29వ తేదీ కంటే ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడులు చేసిన వివరాలేవీ భారత సైన్యం వద్ద లేవని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎమ్వో) స్పష్టం చేసింది.
2004 నుంచి 2014 వరకు, అలాగే సెప్టెంబర్ 2014 తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత భూభాగంపై భారత్ చేసిన లక్షిత దాడుల వివరాలు తెలపాలని జమ్ముకు చెందిన సామాజిక కార్యకర్త రోహిత్ చౌదరి సమాచార హక్కు చట్టం ద్వారా సైన్యాన్ని కోరారు. అలాగే వీటిలో ఎన్ని దాడులు విజయవంతమయ్యాయో తెలపాలని విజ్ఞప్తి చేశారు.
సైన్యం వద్ద వివరాలు లేవు
ఈ స.హ. చట్టం దరఖాస్తుపై స్పందించింది డీజీఎమ్వో. 2014 సెప్టెంబర్ 29న పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ లక్షిత దాడులు చేసిందని తెలిపింది. ఈ దాడిలో భారత సైనికులెవరూ మరణించలేదని స్పష్టం చేసింది. అంతకు ముందు ఇలాంటి దాడులు జరిపినట్లు సైన్యం వద్ద సమాచారమేదీ లేదని తెలిపింది.
"2016 సెప్టెంబర్ 29 కంటే ముందు లక్షిత దాడులు జరిగినా.. అందుకు సంబంధించిన వివరాలు ఈ (సైన్యం) విభాగం వద్ద లేవు." -లెఫ్టినెంట్ కల్నల్ ఏడీఎస్ జస్రోటియా