వచ్చే నెలలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించే యోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలపై భారత సైన్యం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ సందేశాలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది.
"ఏప్రిల్ నెల మధ్యలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధిస్తుందని, పరిపాలన కోసం సైన్యాన్ని, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పదవీ విరమణ చేసిన వారిని వినియోగించుకోనున్నట్లు వస్తున్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై మేము వివరణ ఇస్తున్నాం. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం.