తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంపన్'​ సహాయక చర్యల్లో సైనిక సిబ్బంది - amphan cyclone news

బంగాల్​లోని 'అంపన్​' తుపాను సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు బలగాలను తరలించినట్లు అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాలు ఇంకా దిగ్బంధంలోనే ఉండటం వల్ల మరో 10 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలను కుడా పంపినట్లు కేంద్రం వెల్లడించింది.

Army deployed in cyclone-ravaged Bengal for restoration work
'అంపన్'​ సహాయక చర్యల్లో సైనిక సిబ్బంది

By

Published : May 23, 2020, 11:55 PM IST

భారీ తుపాను అంపన్​ కారణంగా బంగాల్​లో నాశనమైన మౌలిక సౌకర్యాలను.. పునరుద్ధరించడానికి సైన్యం రంగంలోకి దిగింది. మమతా బెనర్జీ సర్కార్​ అభ్యర్థన మేరకు సైనికులను తరలించినట్లు కేంద్ర వెల్లడించింది.

రాష్ట్రంలో కోల్​కతా సహా పలు ప్రాంతాలకు సైన్యాన్ని తరలించినట్లు అధికారులు తెలిపారు. రోడ్లపై పడి ఉన్న చెట్లను తొలగించడానికి సైనిక సిబ్బందిని.. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్, బల్లిగంజ్​, బెహాలా ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపారు.

రాష్ట్రానికి మరో 10 బృందాలు

'అంపన్' తుపాను ఉపశమన, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి... ఇప్పటికే ఆరు తుపాను ప్రభావిత జిల్లాకు 26 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్​డీఆర్​ఎఫ్) బృందాలను పంపించినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా మరో 10 ఎన్‌డీఆర్‌ఎఫ్​ బృందాలనూ తరలించినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇదీ చూడండి:10 రోజుల్లో మరో 2,600 రైళ్లు- 36 లక్షల మంది టార్గెట్

ABOUT THE AUTHOR

...view details