ఆర్మీ దినోత్సవం సందర్భంగా దిల్లీలో సైనిక శక్తిని, అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది భారత సైన్యం. ఈ కార్యక్రమంలో సైన్యాధిపతి ఎంఎం నరవాణే, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, నేవీ చీఫ్ కరంబీర్ సింగ్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పాల్గొన్నారు. కరియప్ప మైదానంలో జరిగిన ఈ వేడుకలో పరేడ్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఆర్మీ కెప్టెన్ తానియా షెర్గిల్ గుర్తింపు పొందారు. పరేడ్ అనంతరం జవాన్లకు పథకాలు ప్రదానం చేశారు నరవాణే.
ఆర్మీ దినోత్సవాన్ని ఏటా జనవరి 15న నిర్వహిస్తారు. అప్పటి లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప 1949లో భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిందుకు ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని జరుపుతారు.
సైన్యంపై మోదీ ప్రశంసలు