సరిహద్దులో సైనిక ప్రతిష్టంభనపై భారత్-చైనా సీనియర్ ఆర్మీ కమాండర్ల మధ్య ఆరో విడత చర్చలు జరిగాయి. ఉద్రిక్తతలు తగ్గించుకునేలా ఇరుదేశాల మధ్య కుదిరిన అయిదు సూత్రాల ఒప్పందాన్ని అమలు చేయడంపై సైనికాధికారులు చర్చించారు.
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వైపు ఉన్న మోల్దోలో ఉదయం 9 గంటలకు కార్ప్స్ కమాండర్ భేటీ జరిగినట్లు భారత సైన్యం తెలిపింది. సమావేశం ఇంకా కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది.
భారత్ తరపున 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ చర్చలకు నేతృత్వం వహిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో భాగంగా ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు.. నిర్దిష్ట కాలవ్యవధిని నిర్ణయించడమే ఈ చర్చల ప్రధాన అజెండా అని అధికారులు తెలిపారు.
విదేశాంగ శాఖ తొలిసారి