రెండో రోజు పర్యటనలో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని పలు కీలక ప్రాంతాలను సందర్శించారు సైన్యాధిపతి ఎం ఎం నరవాణే. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైన్యం సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. అలాగే గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడిన భారత జవాన్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
బలగాల ధైర్యసాహసాలను కొనియాడి సరిహద్దులో మరింత ఉత్సాహంతో పనిచేయాలని నరవాణే సూచించినట్లు భారత సైన్యం ట్విట్టర్లో తెలిపింది.
సరిహద్దులో భద్రతా పరిస్థితులపై ఉత్తర సైనిక కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేశ్ కుమార్ జోషి, 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, మరో సీనియర్ సైన్యాధికారితో మంగళవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు నరవాణే. చైనా ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడినా దీటుగా బదులిచ్చేలా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రశంసలు సహజం..