భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ లద్ధాఖ్ వెళ్లారు. వాస్తవాధీనరేఖ వెంబడి క్షేత్రస్థాయి పరిస్థితులపై సైనికాధికారులతో బుధవారం చర్చలు జరపనున్నారు. ఈ మేరకు సైనికవర్గాలు తెలిపాయి.
నరవాణే రెండు రోజుల పాటు లద్ధాఖ్‌లో పర్యటిస్తారు. గల్వాన్ లోయ వద్ద ఘర్షణలు మొదలైన తర్వాత సైన్యాధిపతి లద్దాఖ్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. చైనా సైన్యాన్ని తరిమికొట్టేందుకు సైనికచర్యను భారత్ పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో జనరల్ నరవాణే లద్దాఖ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.